ఎస్పీ బాలు కోసం శబరిమల అయ్యప్ప ఆలయంలో 'శంకరాభరణం' పాట సమర్పణ

  • కరోనాతో పోరాడుతున్న బాలసుబ్రహ్మణ్యం
  • విషమంగా బాలు ఆరోగ్యం
  • కోలుకోవాలంటూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు
దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియులను అలరిస్తున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ కు గురై చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కొన్నిరోజులుగా విషమంగా ఉంది. బాలు కోలుకోవాలంటూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా, కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలో సంగీత సమర్పణ చేశారు. ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఆలాపించిన 'శంకరా నాద శరీరారా పరా...' అనే పాటను దేవస్థాన వాయిద్యకారులు తమ ప్రదర్శనతో స్వామివారికి సమర్పించారు.

దీనిపై అయ్యప్ప ఆలయ బోర్డు ట్రావెన్ కూర్ దేవస్వోం వర్గాలు స్పందించాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షిస్తూ ఆయన పేరుతో స్వామివారికి పూజలు నిర్వహించినట్టు వెల్లడించాయి. అప్పట్లో ఘనవిజయం సాధించిన శంకరాభరణం చిత్రంలో బాలు ఆలపించిన 'శంకరా నాద శరీరా పరా' గీతం సాధారణ ప్రజల్లో సైతం ఎంతో ప్రజాదరణ పొందింది.

Musical Offering
Ayyappa Temple
Sabarimala
SP Balasubrahmanyam
Corona Virus

More Telugu News